Thakadhimithom Song Lyrics | Aarya | Allu Arjun, Anuradha Mehta
Music | : Devi Sri Prasad |
Thakadhimithom Song Lyrics in Telugu – Aarya Lyrics
హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం
ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
కష్టం నష్టం యెదురైన నచ్చినదె చేసేద్దాం
అలవాటైనా చేదైనా తకదిమి తోం
తప్పో వొప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
కౄషి వుంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగె జోష్ కరియె జీయేంగె ప్యార్ కరియె
చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా
ఆ ఓర్పుకి తకదిమి తోం
ఉల్లాసమె ఓ వెల్లువల ఓ ఉప్పెనలా ఉరకాలిర
ఆ జోరుకి తకదిమి తోం
పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం
గురి చూసాక మనకింక తిరుగేది
గాయేంగె జోష్ కరియె
నీ మాటతొ అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా
ఆ నేర్పుకి తకదిమి తోం
నా ప్రేమతొ ఆ శత్రువునె ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమి తోం
ఒకటౌదాం ఒకటౌదాం ప్రేమను పంచగ ఒకటౌదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగె ప్యార్ కరియె.